TG: హీటర్ షాక్ తగలడంతో నాలుగేళ్ల బాలుడు బన్నీ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో జరిగింది. వివరాల్లోకి వెళ్లితే తల్లి సుమలత బన్నీని తీసుకుని బంధువుల ఇంటికి వెళ్లింది. అక్కడ వారు బకెట్‌లో వాటర్ పెట్టగా.. ఆడుకుంటూ వెళ్లి దాన్ని తాకి పడిపోయాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో కుటుంబంలో విషాదచాయాలు ఆలముకున్నాయి.