TG: మహిళల భద్రతపై ప్రభుత్వం కీలక నిర్ణయం

51చూసినవారు
TG: మహిళల భద్రతపై ప్రభుత్వం కీలక నిర్ణయం
TG: ఉద్యోగాలు చేసే మహిళలు నిర్భయంగా రాత్రిళ్లు కూడా ప్రయాణించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు ప్రైవేటు ప్రజా రవాణా బస్సులు, క్యాబ్‌లు, మ్యాక్సీ క్యాబ్‌లలో ‘వెహికల్‌ లొకేషన్‌ ట్రాకింగ్‌ డివైజ్‌’లను తప్పనిసరి చేసింది. మహిళలకు ఇబ్బందులు ఎదురైతే అందులో ఉండే ఒక్క బటన్‌ నొక్కితే క్షణాల్లో పోలీసులు ప్రత్యక్షమవుతారు. నిర్భయ చట్టం ప్రకారం కొత్తగా నమోదయ్యే వాహనాలతో పాటు, పాత వాటిలోనూ ఈ పరికరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

సంబంధిత పోస్ట్