వాజపేయినగర్లో రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణ పనులు వెంటనే చేపట్టాలని కోరుతూ మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కి కేశవ్ నగర్ కాలనీ సంక్షేమ సంఘం నాయకులు, మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్ ఆదివారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైల్వే జిహెచ్ఎంసి అధికారులతో మాట్లాడి ఆరూబీ పనులనుత్వరలో ప్రారంభిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈశ్వర్ గౌడ్, గంగాధర్ అంజయ్య పాల్గొన్నారు.