బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణానికి ప్రత్యేక బస్సులు

62చూసినవారు
బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణానికి ప్రత్యేక బస్సులు
బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణోత్సవానికి ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు గ్రేటర్ ఆర్టీసీ శనివారం ప్రకటనలో తెలిపింది. ఈ నెల 9న 18 డిపోల నుంచి 80 బస్సులు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. సికింద్రాబాద్, జేబీఎస్, ఎంజీబీఎస్, సిబిఎస్, ఈసీఎల్ క్రాస్ రోడ్స్, మెహదీపట్నం, దిల్ సుఖ్ నగర్, ఉప్పల్ క్రాస్ రోడ్స్, మియాపూర్ క్రాస్ రోడ్స్, మల్కాజిగిరి ప్రాంతాల నుంచి ఇవి బయలుదేరుతాయన్నారు.

సంబంధిత పోస్ట్