అటల్ బీహారీ వాజ్ పేయి శత జయంతి కార్యక్రమాన్ని మల్కాజ్ గిరి డివిజన్ శివపూరి కాలనీలోని కార్పొరేటర్ కార్యాలయంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. డివిజన్ బీజేపి కార్పొరేటర్ శ్రావణ్ హాజరై వాజ్ పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం దేశానికి వాజ్ పేయి చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు శ్రీ రాంబాబు, డివిజన్ ప్రెసిడెంట్ సోమా శ్రీనివాస్ ప్రభు గుప్తా ఇతరులు పాల్గొన్నారు.