సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపి దోషులపై చర్యలు తీసుకోవాలి...

58చూసినవారు
సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపి దోషులపై చర్యలు తీసుకోవాలి...
వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ ఫలితాల అవకతవకలపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ జరిపి దొషులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత యువజన సమాఖ్య( ఏఐవైఎఫ్) నేతలు సోమవారం నిరసన తెలిపారు. రాష్ట్ర సమితి పిలుపులో బాగంగా మేడ్చల్ జిల్లా సమితి అధ్వర్వంలో ఈసిఐయల్ అంబేద్కర్ విగ్రహం వద్ద ప్లకార్డులు ప్రదర్శిస్తూ ధర్నా నిర్వహించారు. ఏఐవైఎఫ్ మేడ్చల్ కార్యదర్శి సత్యం పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్