హైదరాబాద్: రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో పది రోజుల పాటు 163 సెక్షన్ అమలు చేస్తున్నట్లు ఆదివారం పోలీసులు ప్రకటించారు. టీజీపీఎస్సీ నిర్వహించే డిపార్ట్మెంటల్ పరీక్షల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ ఆంక్షలు నవంబర్ 25 నుంచి డిసెంబర్ 8వ తేదీ వరకు అమల్లో ఉంటాయన్నారు. పరీక్షా కేంద్రాలకు 200 మీటర్ల దూరం ఉండాలని పోలీసులు హెచ్చరించారు.