ఎమ్మెల్సీ కవిత తన మంగళవారం హైదరాబాద్లోని వారి నివాసంలో కుటుంబ సభ్యుల మధ్య సంక్రాంతి సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. సంక్రాంతి పండుగ సంప్రదాయం ఉట్టిపడేలా ఉత్సవాలు నిర్వహించారు. ఎమ్మెల్సీ కవిత స్వయంగా ముగ్గులు వేసి సంక్రాంతి వేడుకల్లో పాలుపంచుకున్నారు. అనంతరం ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర ప్రజలు, రైతాంగం పాడిపంటలు, సిరి సంపదలు, సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారు.