మెహిదిపట్నం సర్కిల్ పరిధిలో జంక్షన్ల అభివృద్ది పనులను ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ అనురాగ్ జయంతి ట్రాఫిక్ పోలీస్ అధికారులతో కలిసి గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా అభివృద్ది పనులపై వివరాలను తెలుసుకున్నారు. జంక్షన్ల సుందరీకరణతో పాటు ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పనులు చేపడుతున్నట్లు తెలిపారు. అలాగే పాదచారుల కోసం ప్రత్యేకంగా ఫుట్ పాత్ నిర్మాణాలు కూడా చేపడుతున్నట్లు తెలిపారు.