బాలానగర్ పీఎస్ పరిధిలో సోమవారం ఏసీపీ హనుమంతరావు రౌడీషీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చారు. పోలీస్ స్టేషన్ పరిధిలోని 12 మందికి వారి నడవడికపై పలు సూచనలు చేశారు. ఆయన మాట్లాడుతూ. వచ్చే నూతన సంవత్సర వేడుకలలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంతేకాకుండా జైలుకు సైతం పంపిస్తామన్నారు. గతంలో నేరాలకు పాల్పడిన వారు నేర ప్రవృత్తిని వీడి సమాజంలో మంచిగా మెలగాలని సూచించారు