వెస్ట్ మారేడు పల్లిలోని ప్రధాన రహదారికి ఇరువైపులా ఉన్న అక్రమ వ్యాపార సముదాయాలను జీహెచ్ఎంసీ, కంటోన్మెంట్ ట్రాఫిక్ అధికారులు శనివారం కూల్చివేశారు. పుట్ పాత్ లను ఆక్రమించి వ్యాపార సముదాయాలు నిర్వహిస్తున్న వారిపై కొరడా ఝులిపించారు. ఏళ్ల తరబడి వ్యాపారం చేస్తున్న తమను రోడ్డున పడేశారంటు వ్యాపారులు అవేదన వ్యక్తం చేశారు.