కార్పొరేటర్ సామల హేమ సీతఫలమండి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద పారిశుధ్య కార్మికులకు చెత్త సేకరణ రిక్షాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇంటింటి చెత్త సేకరణ సులభతరం చేయుట కొరకు రిక్షాలు పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. ఒక్కొక్క రిక్షాకు 24 వేలు వ్యయంతో కొనుగోలు చేసినట్లు తెలిపారు. మొత్తం 10 రిక్షాలను పంపిణీ చేసినట్లు తెలిపారు. మొత్తం 2 లక్షల 40 వేల రూపాయలు అయినట్లు తెలిపారు.