బోయిన్‌పల్లి: వెంకటేశ్వరస్వామి ఆలయంలో ధనుర్మాస పూజలలో పాల్గొన్న భక్తులు

74చూసినవారు
బోయిన్‌పల్లి: వెంకటేశ్వరస్వామి ఆలయంలో ధనుర్మాస పూజలలో పాల్గొన్న భక్తులు
బోయిన్‌పల్లిలో ప్రసిద్ధిగాంచిన న్యూసిటీ కాలనీలోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో సోమవారం తెల్లవారుజాము నుంచి ధనుర్మాసం ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ ప్రధాన అర్చకులు పవన్ కుమార్ స్వామి, దీపక్ స్వామి, శ్రీధర్ స్వామిలు అమ్మవార్లకు ప్రత్యేక అలంకారం చేసి ధనుర్మాసం ఉత్సవాలను వేదమంత్రాలతో భక్తుల నామస్మరణల మధ్య నిర్వహించారు. చలిని తట్టుకొని ప్రత్యేక పూజలను తిలకించి భక్తి పారవశ్యంలో మునిగిపోయారు.

సంబంధిత పోస్ట్