మౌలాలి గుట్టపై ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న ఉర్సు ఉత్సవాలకు కావల్సిన అన్ని ఏర్పాట్లు చేయాలని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఉత్సవ నిర్వహణ కమిటీ ఇన్ ఛార్జ్ సయ్యద్ అలీ, భాగ్యానందరావు మంగళవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కలిసి మౌలాలి గుట్ట సమస్యలను తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మౌలాలి కమాన్ నుంచి గుట్ట మీదికి రోడ్డు మరమ్మత్తులను చేయాలని కోరారు.