బోయినపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని సీతారాంపురం బస్తీకి చెందిన ఓ యువతి అదృశ్యమైనట్లు బోయినపల్లి ఎస్ఐ శివ శంకర్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం కరిష్మా కుమారి 22న మధ్యాహ్నం ఒంటి గంటకు ఇంట్లో నుంచి వెళ్లిపోయినట్లు తల్లి చోటి రూబీదేవి బుధవారం ఫిర్యాదు చేసిందన్నారు. ఐదు రోజుల నుంచి ఆమె నిరంతరం ఫోనులో మాట్లాడుతున్న విషయం గ్రహించి తల్లి ఆమెను హెచ్చరించింది. దీంతో ఆమె ఇంట్లో చెప్పకుండా వెళ్ళిపోయింది.