హైదరాబాద్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలకు సహకరించకుండా సిద్దిపేట ట్రాఫిక్ ఏసీపీ సుమన్ హంగామా చేశారు. ఎస్ ఆర్ నగర్లో పోలీసులు డ్రంక్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఓ కారును ఆపారు. డ్రైవింగ్ చేసిన జైపాల్ రెడ్డి మద్యం తాగినట్లు గుర్తించారు. అయితే, అదే కారులో ఉన్న ఏసీపి సుమన్ కారు దిగి పోలీసులతో వాగ్వాదం పెట్టుకున్నారు. విధులకు ఆటంకం కలిగించిన ఆయనతో పాటు కారులో ఉన్న ముగ్గురిపై కేసు నమోదైంది.