దారుణం.. రోడ్డు పక్కన చెత్తకుప్పలో పసికూన

52చూసినవారు
దారుణం.. రోడ్డు పక్కన చెత్తకుప్పలో పసికూన
పేగు తెంచుకొని పుట్టిన కన్నబిడ్డను చెత్తకుప్పలో పడేశారు. చిలకలగూడ ఎస్సై కిషోర్ కథనం ప్రకారం. ఈనెల 14న గాంధీ ఆసుపత్రి వెనుక గేట్ పక్కన పడి ఉన్న నెలన్నర వయసుగల పసిపాపను చూసిన స్థానికులు తమకు సమాచారం ఇచ్చారన్నారు. అనంతరం నిలోఫర్కు తరలించగా చికిత్స పొందుతూ పాప ఆదివారం సాయంత్రం చనిపోయింది. సాధారణ సైజు కన్నా తల పెద్దగా ఉండటంతోనే కన్నవారు ఇలా పాపను వదిలించుకున్నారని పోలీసులు భావిస్తున్నారు.

సంబంధిత పోస్ట్