చిలకలగూడ పిఎస్ పరిధిలో ఓ వివాహిత అదృశ్యమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వారాసిగూడ బ్రాహ్మణ బస్తీకి చెందిన పిట్ల శిరీష (26)కు కుటుంబ సభ్యులతో కొంతకాలంగా ఇంట్లో గొడవలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 22న ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. కుటుంబ సభ్యులు తమకు తెలిసిన అన్నిచోట్ల వెతికినా ఆచూకీ దొరకలేదని బుధవారం ఫిర్యాదు చేశారు. ఆచూకీ తెలిసిన వారు సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు.