నర్సాపూర్ చౌరస్తాలో బీఆర్ఎస్ మాజీ మంత్రి, నర్సాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో సోమవారం వందలమంది రైతులు మరియు పార్టీ నాయకులు రైతు ధర్నా చేపట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇచ్చిన మాట తప్పారని, ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదు అంటూ నినాదాలు చేస్తూ, రాస్తారోకో చేపట్టారు. ఎలాంటి అవరోధాలు జరగకుండా పోలీసు అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు.