ఛత్తీస్‌గఢ్ జర్నలిస్ట్ ముకేశ్ చంద్రకర్‌ను అత్యంత ఘోరంగా చంపినట్లు పోస్టుమార్టం రిపోర్టులో తేలింది. అతడిని చంపి గుండెను బయటకు తీశారని, కాలేయం 4 ముక్కలైందని గుర్తించారు. పక్కటెముకలు 5 చోట్ల, తలపై 15 చోట్ల ఎముకలు విరిగిపోయాయి. రూ.120 కోట్ల విలువైన రోడ్డు కాంట్రాక్టులో అవినీతి జరిగిందని ముకేశ్ కథనాలు ప్రసారం చేశారు. జనవరి 1 నుంచి కనిపించకుండా పోయిన జర్నలిస్టు డెడ్ బాడీ ఆ కాంట్రాక్టర్ ఇంటి సెప్టిక్ ట్యాంకులో లభ్యమవ్వడం అనుమానాలకు తావిస్తోంది.