సనత్నగర్లోని ఈఎస్ఐ హాస్పిటల్, కాలేజీలో నేడు ప్రపంచ క్షయ డే సందర్భంగా పల్మనాలజీ విభాగాధిపతి డాక్టర్ కె. సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ ఘనంగా నిర్వహించారు. 'టీబీ హారేగా ఇండియా జీతేగా' అంటూ మెడికల్ విద్యార్థుల నినాదం చేశారు. కాలేజీ క్యాంపస్ నుంచి మెయిన్ గేట్ వరకు ర్యాలీ కొనసాగింది. ఈ కార్యక్రమంలో పల్మనాలజీ విభాగాధిపతి డాక్టర్ సురేందర్ రెడ్డి, డా. శిరీష్ కుమార్, చవాన్, డీన్ పాల్గొన్నారు.