హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అస్సెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ (హైడ్రా) మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎఫ్ఎఎల్ పరిధిలో నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన అధికారులపై క్రిమినల్ కేసులకు సిద్ధమైంది. ఆరుగురు అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సైబరాబాద్ కమిషనర్ కు హైడ్రా సిఫారసు చేసింది.
జీహెచ్ఎంసీ చందానగర్ డిప్యూటీ కమిషనర్ తో పాటు పలువురు పై కేసు నమోదు చేయాలనీ నిర్ణయించారు.