సీఎం జన్మదిన వేడుకను మహారాష్ట్రలో జరిపిన సీతక్క

79చూసినవారు
సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను మంత్రి సీతక్క మహారాష్ట్రలో నిర్వహించారు. గురువారం అర్థరాత్రి (శుక్రవారం తెల్లవారుజాము) కేక్ కట్ చేసి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మహారాష్ట్ర ఎన్నికల్లో భాగంగా అక్కడ పర్యటిస్తున్న నేపథ్యంలో తెలంగాణలో వేడుకలు జరుపుకోలేకపోతున్నానని మంత్రి అన్నారు. సీఎం శక్తివంతంగా పరిపాలిస్తూ ప్రజా నాయకుడిగా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలని అమే ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్