రోడ్డు భద్రత వారోత్సవాల సందర్భంగా శనివారం ఓవైసి చౌరస్తాలో సంతోష్ నగర్ ట్రాఫిక్ పోలీసులు నియమాలు తెలియజేస్తూ ప్లకార్డులతో ప్రదర్శన నిర్వహించారు. తప్పనిసరిగా హెల్మెట్ పెట్టుకొని బైకులు నడపాలని కారుడ్రైవర్లు సీట్‌బెల్ట్ ధరించాలని, మద్యం తాగి ఎట్టిపరిస్థితుల్లో వాహనాలు నడుపకూడదని తెలిపారు. మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దని ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ నియమాలు తప్పనిసరిగా పాటించాలని కోరుతూ ప్రదర్శన చేశారు.