డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, యువ హీరో తేజ సజ్జా కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రం హనుమాన్. సంక్రాంతి కానుకగా ఈనెల 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో భాగంగా మేకర్స్.. ఈ సినిమా నుంచి శ్రీరామదూత స్తోత్రాన్ని విడుదల చేశారు. ఈ పాట వింటే గూస్ బంప్స్ రావడం గ్యారెంటీ. ఇక ఈ స్తోత్రాన్ని సాయి చరణ్ భాస్కరుని, లోకేశ్వర్ ఈదర, హర్షవర్దన్ చావలి కలిసి పాడగా.. గౌరహరి సంగీతం అందించాడు.