‘బ్రేకప్ వల్ల ఎంతో బాధపడ్డా, మానసికంగా కుంగిపోయాను’ అని సినీ నటి రాశీఖన్నా అన్నారు. ‘ది సబర్మతీ రిపోర్ట్’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఆమె ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ‘బ్రేకప్ తర్వాత నన్ను నేను మార్చుకున్నా. స్ట్రాంగ్‌గా నిలబడ్డా. ఇండస్ట్రీలో కంటే బయటే నాకు ఎంతోమంది స్నేహితులు ఉన్నారు. కుటుంబసభ్యులు, స్నేహితులే నాకు అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తుంటారు. వారే నా బలం’’ అని తెలిపారు.