రిమోట్‌‌తో వ్యవసాయం.. యువకుల నూతన ఆవిష్కరణ

84చూసినవారు
రిమోట్‌‌తో వ్యవసాయం.. యువకుల నూతన ఆవిష్కరణ
ఏపీఎస్‌ఐ అంకుర సంస్థ వ్యవస్థాపకులు అభిషేక్‌ శవరణన్, కార్తీక్‌లు రైతులకు మద్దతుగా నూతన ఆవిష్కరణ చేశారు. హైదరాబాద్‌లోని జాతీయ వ్యవసాయ పరిశోధన, నిర్వహణ సంస్థ(నార్మ్‌)లో జరిగిన కార్యక్రమంలో తమ ఆవిష్కరణనను ప్రదర్శించారు. రైతులు పొలం గట్టునే కూర్చొని కలుపు తీసేలా ఫార్మేట్‌ యంత్రాన్ని వీరు రూపొందించారు. ఇది రిమోట్‌ కంట్రోల్‌ సాయంతో పని చేస్తుంది. దీని వల్ల రైతులకు శ్రమ, కూలి ఖర్చు తగ్గుతాయని వివరించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్