మనం ఎక్కడి నుంచి వచ్చామో మర్చిపోకూడదని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ‘రఘుపతి వెంకయ్య నాయుడు గారిని మర్చిపోలేదు. దాదాసాహెబ్ ఫాల్కే, నాగిరెడ్డి, బీఎన్ రెడ్డి, రామ్ బ్రహ్మంగారిని, ఈ రోజు వేదిక మీద శంకర్ గారు లాంటి మహానుభావులు ఉన్నారంటే మేము మూలాలు మరిచిపోకూడదు’ అన్నారు. తెలుగు సినీ పరిశ్రమ పెద్దలందరినీ గుర్తు చేసుకుంటూ ఎన్టీ రామారావు, మెగాస్టార్ చిరంజీవి గారే మాకు మూలం అన్నారు.