కేసీఆర్‌ అప్పుల రాష్ట్రం చేస్తే.. కాంగ్రెస్‌ దాన్ని కొనసాగిస్తోంది: కిషన్‌రెడ్డి

56చూసినవారు
కేసీఆర్‌ అప్పుల రాష్ట్రం చేస్తే.. కాంగ్రెస్‌ దాన్ని కొనసాగిస్తోంది: కిషన్‌రెడ్డి
తెలంగాణను కేసీఆర్‌ అప్పుల రాష్ట్రం చేస్తే.. కాంగ్రెస్‌ దాన్ని కొనసాగిస్తోందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. స్థానిక ఎన్నికల్లో ఓట్లు అడిగే హక్కు బీజేపీకే ఉందన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం గ్రామాల్లో జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉందన్నారు. 7 నెలలుగా GHMCలో వీధిలైట్లకు నిధుల కొరత ఉందని చెప్పారు. చెరువుల కబ్జాను అరికట్టే చట్టం గతంలో కూడా ఉందని.. పాత చట్టానికి హైడ్రా అనే పేరు పెట్టారని అన్నారు. మెట్రో రెండో దశకు కేంద్రం సాయం చేస్తుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్