అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న వృద్ధ దంపతులు

66చూసినవారు
అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న వృద్ధ దంపతులు
TG: ఖమ్మం జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. సత్తుపల్లి మండలం బుగ్గపాడు గ్రామానికి చెందిన కృష్ణ(60),సీత(55) అనే వృద్ధ దంపతులు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. అయితే అప్పుల బాధతో చెరువులోకి దూకి ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్