ఇతర ప్రాంతాల వారు వెళ్లకపోతే చర్యలు తప్పవు: ఎస్పీ

84చూసినవారు
ఇతర ప్రాంతాల వారు వెళ్లకపోతే చర్యలు తప్పవు:  ఎస్పీ
లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ప్రచారం కోసం ఆదిలాబాద్ జిల్లాకు వచ్చిన ఇతర ప్రాంతాల వారు వెళ్లిపోవాలని జిల్లా ఎస్పీ గౌస్‌ ఆలం హెచ్చరించారు. ఇతర ప్రాంతాల వారు జిల్లాలో ఉంటే చర్యలు తప్పవన్నారు. ప్రచార పర్వం ముగియటంతో డీఎస్పీ లక్కిరెడ్డి జీవన్ రెడ్డితో కలిసి జిల్లా కేంద్రంలోని లాడ్జీలు, ఫంక్షన్ హాల్స్, కుల సంఘాల భవనాల్లో తనిఖీలు నిర్వహించారు. పలుచోట్ల లాడ్జిల్లో బ్యాగులను పోలీసులు తనిఖీలు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్