స్వీట్లను అతిగా తింటే అనేక అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఎముకలని బలహీనపరిచే షుగర్స్, ఆక్సలేట్ చాక్లెట్స్ లో ఎక్కువగా ఉంటాయి. అందుకే చాక్లెట్లను అతిగా తినకపోవడమే మంచిది. చాలా షాపుల్లో స్వీట్స్ అందంగా కనపడటానికి వాటి మీద రసాయనాలతో కూడిన కలర్స్ అద్దే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అవి శరీరానికి ఎక్కువ హానిని కలిగిస్తాయి. చక్కెర కూడా స్వీట్లలో ఎక్కువగా ఉండటం వల్ల అవి బరువు పెరిగేలా చేస్తాయి.