రాష్ట్రంలో సీజనల్ వ్యాధుల నియంత్రణపై వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల వైద్యాధికారులతో సమీక్ష నిర్వహించారు. డెంగ్యూ, మలేరియా, డయేరియా తదితర సీజనల్ వ్యాధులకు సంబంధించి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆస్పత్రుల్లో పారిశుద్ధ్యం, పర్యావరణ శుభ్రతపైన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.