కొత్త వాహనాలు కొనేవారు సరైన స్క్రాపేజ్ సర్టిఫికెట్తో పాత వాహనాలు ఇస్తే డిస్కౌంట్ అందించేందుకు పలు వాహన సంస్థలు అంగీకరించాయని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. 'ఈ కార్యక్రమం ఆర్థిక వ్యవస్థ కార్యకలాపాలను గణనీయంగా ముందుకు తీసుకెళ్తుంది, సురక్షితమైన, సమర్థమైన వాహనాలు మన రోడ్లపై ఉండేలా చూస్తుంది' అని గడ్కరీ ఎక్స్ లో పేర్కొన్నారు. దీని ద్వారా పాత వాహనాల వినియోగం తగ్గుందని వెల్లడించారు.