అత్యంత వేగంగా వ్యాపించే ప్రాణాంతక వ్యాధి.. కలరా

64చూసినవారు
అత్యంత వేగంగా వ్యాపించే ప్రాణాంతక వ్యాధి.. కలరా
కలరా వ్యాధి విబ్రియో కలరే అనే బాక్టీరియా వలన వ్యాపిస్తుంది. ఇది కలుషిత నీరు ద్వారా కానీ, ఆహారం ద్వారా కానీ వ్యాప్తి చెందుతుంది. ఇది అత్యంత వేగంగా వ్యాపించే ప్రాణాంతక వ్యాధి. అతి విరోచనాలతో మొదలయ్యే ఈ వ్యాధి సోకిన వెంటనే చికిత్స తీసుకోకపోతే రోగి మరణించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రపంచంలో నమోదవుతున్న కలరా కేసులు ఎక్కువగా ఆఫ్రికా ఖండం నుంచి నమోదవుతున్నవే. కలరా సోకిన తర్వాత ఆఫ్రికాలో 5% మంది చనిపోతే.. ఇతర దేశాల్లో అయితే ఇది కేవలం 1% మాత్రమే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్