ఏపీని విషజ్వరాలు వణికిస్తున్నాయి. గుంటూరు, విజయవాడ, ఏలూరు, తిరుపతి, విశాఖపట్నం సహా పెద్ద నగరాల్లో ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ కార్పొరేట్ ఆస్పత్రులు జ్వర పీడితులతో కిక్కిరిశాయి. దగ్గు, జలుబు, గొంతు నొప్పితో ప్రారంభమై అత్యధికులు జ్వరాల బారిన పడుతున్నారు. జ్వరం తగ్గాక ఒళ్ల నొప్పులతో బాధపడేవారూ ఎక్కువగా ఉన్నారు.