చేతి పంపు కొడితే నీటికి బదులు మద్యం వస్తోంది!

63చూసినవారు
చేతి పంపు కొడితే నీటికి బదులు మద్యం వస్తోంది!
యూపీలోని ఝాన్సీలోని పరగణా గ్రామంలో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. చేతి పంపు (బోరింగ్) కొట్టడంతో నీటికి బదులు మద్యం బయటకు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ప్రాంతంలో అక్రమ మద్యం విక్రయిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో దాడులు నిర్వహించారు. పొలాల్లో పెద్దఎత్తున బోరింగ్‌లు ఉండడంతో అనుమానం వచ్చి పరీక్షించగా మద్యం దొరికింది. మద్యం డ్రమ్ములను భూమిలో ఉంచి చేతి పంపుల ద్వారా పైకి తీస్తున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్