ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్‌ను నేడు డిప్యూటీ సీఎం భట్టీ విక్రమార్క సందర్శించారు. ఈ సందర్భంగా ఆస్ట్రేలియా – ఇండియా క్రిటికల్ మినరల్ రిసెర్చ్ వర్క్ షాప్‌ను ప్రారంభించి మాట్లాడారు. దేశ ప్రగతిలో ఐఐటీలది కీలక ప్రాతని, ఆవిష్కరణలకు కేంద్ర బిందువుగా ఐఐటీ హైదరాబాద్‌ను మారుస్తామన్నారు. రాష్ట్రాన్ని గ్రీన్ ఎనర్జీ హాబ్‌గా మార్చి 2030 నాటికి 2 వేల మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ పెట్టుబడులే లక్ష్యంగా పని చేస్తామన్నారు.