ఇళయరాజా నోటీసులు.. స్పందించిన మంజుమ్మెల్‌ బాయ్స్‌ నిర్మాత

58చూసినవారు
ఇళయరాజా నోటీసులు.. స్పందించిన మంజుమ్మెల్‌ బాయ్స్‌ నిర్మాత
‘మంజుమ్మెల్‌ బాయ్స్‌’ చిత్ర నిర్మాతకు సంగీత దర్శకుడు ఇళయరాజా లీగల్ నోటీసులు పంపిన సంగతి తెలిసిందే. తన అనుమతి లేకుండా ‘గుణ’లోని పాటను సినిమాలో వాడారంటూ నోటీసుల్లో పేర్కొన్నారు. దీనిపై చిత్ర నిర్మాత ఆంటోనీ స్పందించారు. ఓ న్యూస్‌ పోర్టల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..కాపీరైట్‌ కలిగిన రెండు మ్యూజిక్‌ కంపెనీలను సంప్రదించి వారినుంచి అనుమతి తీసుకున్న తర్వాతే పాటను వాడామని స్పష్టత ఇచ్చారు.

సంబంధిత పోస్ట్