బంగ్లాదేశ్ నుంచి చొరబాట్లు, అవినీతి ఆగాలంటే 2026లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుతోనే సాధ్యమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఇవాళ కోల్‌కతాలో పార్టీ శ్రేణులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మహిళలకు భద్రత లేదని చెప్పడానికి సందేశ్ ఖాలీ హింస, ఆర్‌జీ కర్ ఆస్పత్రి ఉదంతాలే నిదర్శనమని చెప్పారు. ఈ అక్రమ వలసలు పెరగడం వల్ల దేశంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని ఆందోళన వ్యక్తంచేశారు.