శృంగార లైఫ్ ని మెరుగుపరుచుకోండిలా

162172చూసినవారు
శృంగార లైఫ్ ని మెరుగుపరుచుకోండిలా
జీవితంలో ఏ పనిని ఎప్పుడూ ఒకేలా చేయకూడదు. అలా చేస్తే ఆ పనిపై ఉన్న ఆసక్తి పోతుంది. శృంగారం కూడా అంతే. పడక గదిలో జంటలు ఒకే విధానాన్ని అనుసరించడం ద్వారా విసుగు చెందుతారు. కొన్నిసార్లు శృంగారం పట్ల వారికి ఆసక్తి కూడా తగ్గుతుంది. దీంతో చాలా మంది ఈ పరిస్థితిని ఎదుర్కోవటానికి తమకు మెడిసిన్ అవసరమని భావిస్తారు. కానీ దానికి ఎలాంటి మందులు అవసరం లేదు. మీ లైంగిక పనితీరులో కొత్తదనం ఉంటే చాలు.

భాగస్వామి యొక్క మానసిక స్థితిని అర్థం చేసుకోండి..
మీరు శారీరకంగా కలవాలనుకుంటున్నారు. కానీ మీ భాగస్వామి ఆ మూడ్ లో లేరు. అప్పుడు వారి మానసిక స్థితిని సెట్ చేయడం మీ బాధ్యత. వారిని ఉత్తేజపరిచే విధంగా మీరు వారితో మాట్లాడవచ్చు. ఆ సందర్భానికి అనుగుణంగా మీరు మీ దుస్తులను కూడా ఎంచుకోవచ్చు. మీరు వారిని ఎంత ఎక్కువ ప్రేరేపిస్తే అంత మంచి ఫలితాలు వస్తాయి.

భాగస్వామిని ఆకర్షించండి..
భార్యాభర్తల్లో శృంగారం పట్ల ప్రారంభ దశలో ఉండే ఉత్సాహం.. కాలక్రమేణా మసకబారడం ప్రారంభమవుతుంది. అటువంటి పరిస్థితిలో మీలో లోపం ఉందని మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. మీరిద్దరూ ఆ సంబంధంలో కొత్తదనాన్ని తీసుకురావడానికి ప్రయత్నించాలి. మీరు మీ ప్రవర్తనతో దీన్ని చేయవచ్చు.

సిగ్గు వదిలేయండి..
మీరిద్దరూ స్పర్శతో సుఖంగా ఉన్నప్పుడు మాత్రమే మీరు సన్నిహిత క్షణాలను ఆస్వాదించవచ్చు. బెడ్ పైకి వెళ్ళాక మీకు అయిష్టత లేదా సిగ్గు ఉంటే.. అది మీ భాగస్వామి యొక్క ఉత్సాహాన్ని కూడా చల్లబరుస్తుంది. మీరు రోజుకో విధంగా మీ శృంగార విధానాన్ని ప్లాన్ చేసుకోవచ్చు. మీ శృంగార సెషన్ ‌ను థ్రిల్లింగ్ ‌గా మార్చుకోవచ్చు.

మాస్టర్‌బేషన్..
మాస్టర్‌బేషన్ మీ ఆరోగ్యానికి మంచిదే. చాలా మంది నిపుణులు మాస్టర్‌బేషన్‌ ను కూడా సిఫార్సు చేస్తారు. ఇది మీ లైంగిక జీవితాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. మీ పనితీరు కోసం మీరు మెడిసిన్ మీద ఆధారపడకూడదు. బదులుగా మాస్టర్‌బేటింగ్ ద్వారా శారీరక సంబంధం కోసం మానసిక స్థితిని సృష్టించుకోవచ్చు.

మంచి ఆహారం తీసుకోవాలి..
లైంగిక పనితీరును పెంచుతుందని చెప్పుకునే మందులు కొన్ని దుష్ప్రభావాలను కలిగి ఉంటాయి. వాటికి బదులు.. ముందు మీరు మీ ఆహారాన్ని కూడా మార్చాలి. ఆరోగ్యకరమైన లైంగిక జీవితం కోసం మీ ఆహారంలో పుచ్చకాయ, స్ట్రాబెర్రీ, బాదం, డార్క్ చాక్లెట్ మొదలైనవి చేర్చాలి.

ధూమపానం వదిలేయండి
మీ ధూమపాన వ్యసనం మీ లైంగిక పనితీరును బాగా ప్రభావితం చేస్తుంది. మీరు నిజంగా ఎలాంటి ఔషధాలను వాడకుండా లైంగిక జీవితం ఎంజాయ్ చేయాలంటే.. ధూమపానం మానేసి ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రయత్నించండి.

సంబంధిత పోస్ట్