కేంద్ర బడ్జెట్‌లో ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ ఇండియా కూటమికి చెందిన ఎంపీలు పార్లమెంటు ఆవరణలో ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయటంతోపాటు ప్లకార్డులు ప్రదర్శించారు. నిధుల కేటాయింపులో అన్ని రాష్ట్రాలను సమానంగా చూడటంతోపాటు న్యాయంచేయాలని డిమాండ్ చేశారు. ఈ ఆందోళనలో సోనియా, రాహుల్, అఖిలేష్, జయాబచ్చన్, తదితరులు పాల్గొన్నారు.