దక్షిణ చైనా సముద్రంపై చైనా ఆధిపత్య ధోరణి ప్రదర్శిస్తున్నందున ఇండో- పసిఫిక్‌లో అన్ని దేశాల నౌకలు స్వేచ్ఛగా రాకపోకలు జరిపే వాతావరణాన్ని పరిరక్షించడానికి భారత్, స్పెయిన్‌లు చేతులు కలపాలని స్పెయిన్ ప్రభుత్వాధినేత పెడ్రో సాంచెజ్ పేర్కొన్నారు. స్పెయిన్- ఇండియా ఫోరమ్, అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్‌లు నిర్వహించిన సభలో ఆయన ప్రసంగిస్తూ.. ప్రపంచ జీడీపీకి ఇండో- పసిఫిక్ ప్రాంత దేశాలు 36 శాతం వాటా సమకూరుస్తున్నాయన్నారు.