పదేళ్ల కాలంలో దేశ బడ్జెట్‌ను మూడింతలు చేశామని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. నూతన ఆవిష్కరణలతో భారత్ కొత్త పుంతలు తొక్కుతోందని, ఈ ఆవిష్కరణల్లో కొత్త ఒరవడి సృష్టించేందుకు దేశం పరుగులు తీస్తోందని వ్యాఖ్యానించారు. ఈసందర్భంగా ఎదురయ్యే సవాళ్లను దీటుగా ఎదుర్కొంటూ పారిశ్రామికంగా ముందడుగు వేస్తున్నామని చెప్పారు. భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) నిర్వహించిన బడ్జెట్ అనంతర సదస్సులో మంగళవారం మోదీ మాట్లాడారు.