ఇజ్రాయెల్ - హెజ్‌బొల్లా మధ్య భీకర దాడులతో నెలకొన్న సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో లెబనాన్‌కు భారత్ మానవతా సాయం అందించింది. అక్కడి ప్రజలకు అవసరమైన ఔషధాలను పంపించాలని నిర్ణయించింది. మొత్తం 33 టన్నుల వైద్య సామగ్రిని పంపుతున్నట్లు కేంద్ర విదేశాంగ శాఖ తెలిపింది. ఇందులో భాగంగా తొలి విడతలో 11 టన్నుల వైద్యసామాగ్రిని ఇవాళ ప్రత్యేక విమానంలో పంపించినట్లు కేంద్ర విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధిర్ జైశ్వాల్ వెల్లడించారు.