'జన్మభూమి'కి బాబు గ్రీన్ సిగ్నల్

83చూసినవారు
'జన్మభూమి'కి బాబు గ్రీన్ సిగ్నల్
ఏపీలో కూటమి సర్కారు కీలక కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. ఎన్నికలకు ముందు ప్రకటించేందుకు సంకోచించిన 'జన్మభూమి' కమిటీలను తీసుకువచ్చేందుకు సీఎం చంద్రబాబు రెడీ అయ్యారు. తాజాగా ఆయన వచ్చే జనవరి నుంచి 'జన్మభూమి'ని ప్రారంభించనున్నట్లు చెప్పారు. అంటే 2014-19 మధ్య ప్రారంభించిన జన్మభూమి కమిటీలను తిరిగి తీసుకురానున్నారని ఆయన మాటల ద్వారా తెలుస్తోంది. జన్మభూమి కమిటీలు అవినీతికి అడ్డాగా మారాయనే విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్