ఛాంపియన్స్ ట్రోఫీలో నేడు ఆసక్తికర మ్యాచ్ జరగనుంది. క్రికెట్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే భారత్-పాకిస్తాన్ అమీతుమీ తలపడనున్నాయి. అయితే పాక్‌తో మ్యాచులో భారత తుది జట్టులోకి వరుణ్ చక్రవర్తి తీసుకుంటారని వార్తలు వినిపిస్తున్నాయి. దుబాయ్‌లో పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుంది. ఈ క్రమంలో బంగ్లాదేశ్‌తో మ్యాచులో అంతగా రాణించని కుల్దీప్ స్థానంలో వరుణ్ చక్రవర్తికి అవకాశం కల్పించనున్నట్లు తెలుస్తోంది.