ఇటీవల అరెస్ట్ చేసిన భారతీయ మత్స్యకారులను శ్రీలంక విడుదల చేసింది. సముద్రంలో అంతర్జాతీయ సరిహద్దులు దాటుకొని వెళ్లి చేపలు పట్టడంతో 15 మంది భారతీయ మత్స్యకారులను శ్రీలంకన్ నేవీ అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అయితే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని వారిని విడుదల చేయాలని కోరడంతో శ్రీలంక వారిని రిలీజ్ చేసింది. జైలు నుంచి విడుదలైన మత్స్యకారులు గురువారం తమిళనాడు చేరుకున్నారు.