రైల్వే ఆధునీరణలో భాగంగా ఇండియన్ రైల్వే వందే మెట్రో సేవలను తీసుకొస్తోంది. ఇందులో భాగంగానే ఈరోజు (సెప్టెంబర్ 16) ప్రధాని మోదీ మెట్రో సేవలను గుజరాత్‌లో ప్రారంభిస్తున్నారు. దేశంలో తొలి వందే మెట్రో భుజ్ నుంచి అహ్మదబాద్ ప్రయణించనుంది. ఈ నేపథ్యంలోనే ఈ రైలు పేరును మార్చుతూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి ఈ రైలును నమో భారత్ ర్యాపిడ్ రైల్‌గా పిలవనున్నారు. ఇది 360 కిలోమీటర్ల దూరాన్ని 5 గంటల 45 నిమిషాల్లోనే చేరుకుంటుందని అధికారులు తెలిపారు.