మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హంతకుల్లో ఒకరి కుమారుడు ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేస్తుండటం పంజాబ్‌లో ఆసక్తికరంగా మారింది. ఇందిరను కాల్చిన బియాంత్ సింగ్ కుమారుడు సరబ్‌జీత్ పంజాబ్‌లోని ఫరీద్‌కోట్ లోక్‌సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఈయన 2004, 2009లో బఠిండా నుంచి, 2007లో భదౌర్ అసెంబ్లీ స్థానం, 2014లో ఫతేగఢ్ సాహిబ్ స్థానాల నుంచి పోటీ చేశారు. అయితే ఎప్పుడూ విజయం సాధించలేదు.